
‘సారంగపాణి జాతకం’ చిత్రంతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ప్రియదర్శి.. మరోవైపు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘ప్రేమంటే’ సినిమా ఒకటి. థ్రిల్ యూ ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్‌లైన్. ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండగా సుమ కనకాల కీలకపాత్ర పోషిస్తోంది. నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ పూర్తయింది.
ప్రియదర్శి, ఆనంది సహా ఇతర నటీనటులు పాల్గొన్న ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రానాకు చెందిన స్పిరిట్ మీడియా దీనిని సమర్పిస్తోంది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.