
అశ్వారావుపేట, వెలుగు: సెల్‌ఫోన్ పవర్ బ్యాంక్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో వెలుగుచూసింది. ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామానికి చెందిన ముచ్చిక గంగరాజుకు ఇద్దరు భార్యలు. గంగరాజు శుక్రవారం తన మొదటి భార్యకు సెల్‌ఫోన్ కొనిచ్చాడు. దీంతో తాను చాలా రోజుల నుంచి పవర్ బ్యాంక్ అడుగుతున్నా కొనివ్వడం లేదని మనస్తాపానికి గురైన గంగరాజు రెండో భార్య లక్ష్మి (22) శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి చెల్లి మడకం చిన్ని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.