3 రోజెస్ సీజన్ 2 అప్డేట్ .. ఈసారి కూడా ముగ్గురితో త్రిపుల్ ఫన్ ఉంటుందట...

3 రోజెస్ సీజన్ 2 అప్డేట్ .. ఈసారి కూడా ముగ్గురితో త్రిపుల్ ఫన్ ఉంటుందట...

ప్రముఖ డైరెక్టర్ కిరణ్ కే  డైరెక్షన్ లో వచ్చిన "3 రోజెస్" వెబ్ సీరీస్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఈ సీరీస్ లో వైవా హర్ష, ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా, సంగీత్ శోభన్, పూర్ణ, పెళ్ పాయల్ రాజపుత్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. మంచి ఫన్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా వైవా హర్ష, ఈషా రెబ్బ మధ్య కామెడీ సీన్స్ చక్కగా అలరించాయి. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈ వెబ్ సిరీస్ 2వ సీజన్ అప్డేట్ ఇచ్చారు.

ALSO READ | ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్-2 షూటింగ్లో విషాదం

ఇందులోభాగంగా డైరెక్టర్ మారుతి ఈ సెకెండ్ సీజన్ లో వైవా హర్ష, ఈషాతోప్ పాటూ మరో ఇద్దరు బ్యూటిఫుల్ రోజెస్ ఉంటారని సోషల్ మీడియాలో తెలిపారు. అలాగే 3 రోజెస్ సీజన్ 2  అనౌన్స్ మెంట్ టీజర్ కూడా షేర్ చేశారు. ఇందులో మొదటి సీజన్ లోని వైవా హర్ష, ఈషా మధ్య డైలాగ్స్  ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మొదటగా ఫస్ట్ సీజన్ లో బాగా వైరల్ అయిన ఫ్రాన్స్, పలావ్ డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. తర్వాత హర్ష అదేంటీ నువ్వోకదానివే వచ్చావని అడగ్గా పూర్ణ, పాయల్ పెళ్ళై చేసుకుని వాళ్ళ పనుల్లో బిజిగా ఉన్నారని అందుకే నేనొక్కదానినే వచ్చానని చెబుతుంది. దీంతో హర్ష అయితే ఈసారి నువ్వొక్కదానివేనా అని అడగ్గా లేదు ఈసారి మరో ఇద్దరు కొత్త బ్యూటిఫుల్ రోజెస్ ఉంటారని హింట్ ఇచ్చింది. కానీ ఆ ఇద్దరూ ఎవరనేది మాత్రం రివీల్ చెయ్యలేదు. దీంతో 3 రోజెస్ సీజన్ 2 కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

అయితే ఈ వెబ్ సిరీస్ ని తెలుగు ప్రముఖ సినీ నిర్మాత శ్రీనివాస్ కుమార్ నిర్మిస్తున్నాడు. 3 రోజెస్ మొదటి సీజన్ ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతోంది.. మరింకెందుకు లేటు... మొదటి సీజన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి..