మరో 4రోజుల్లో క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ పండుగకు సంబంధించిన సెలబ్రేషన్స్ స్టార్టయ్యాయి. ప్రీ క్రిస్మస్ వేడుకల పేరుతో నగరాలు రంగు రంగుల లైటింగ్ తో వెలిగిపోతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ఓ ఇంట్రస్టింగ్ ఇమేజ్ ను షేర్ చేసింది. క్రిస్మస్ ట్రీ క్లస్టర్‌గా పిలవబడే ఈ స్టార్ నర్సరీ NGC 2264ని కలిగి ఉన్న అద్భుతమైన కాస్మిక్ ప్రదర్శనను నాసా బహుమతిగా అందించింది. ఈ ఆకర్షణీయమైన చిత్రం క్రిస్మస్ చెట్టును పోలి ఉంది. ప్రకాశవంతమైన ఆకుపచ్చ మెరుపులు, నీలం తెలుపు రంగుల్లో చిన్న స్టార్స్ తో ఈ పిక్ చాలా అందంగా కనిపిస్తోంది.
NGC 2264 అనేది భూమికి దాదాపు 2,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంతలోని యువ నక్షత్రాల సమూహం. ఈ ఖగోళ అద్భుతాలు ఒకటి నుండి ఐదు మిలియన్ సంవత్సరాల నాటివి. మన సూర్యుడి కంటే చిన్నవిగా ఉంటాయి. తాజాగా నాసా షేర్ చేసిన ఈ చిత్రం చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ నుండి వచ్చింది. కాస్మోస్ లాగా కనిపిస్తోందంటూ నాసా ట్వీట్ చేసింది.
It's beginning to look a lot like cosmos. ?
— NASA (@NASA) December 19, 2023
Our @ChandraXray Observatory recently spotted the blue-and-white lights that decorate the "Christmas Tree Cluster," a swarm of stars and gas some 2,500 light-years from Earth: https://t.co/VT2WaLgp77 pic.twitter.com/HrnrmxRyd7