హీరోయిన్స్ అంటే గ్లామర్ డాల్స్ కాదు

హీరోయిన్లు అంటే గ్లామర్స్ డాల్స్ కాదని ప్రముఖ నటి ప్రియమణి అన్నారు. సౌత్ సినీ పరిశ్రమ మారుతోందని.. నాయికా ప్రాధాన్యమున్న మూవీలను ప్రేక్షకులు  బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. అనుష్క, సమంత, నయనతార లాంటి వాళ్లు నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు హిట్స్ గా నిలవడమే అందుకు నిదర్శనమన్నారు. కమర్షియల్ చిత్రాల్లోనూ అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలను దర్శకులు సృష్టిస్తున్నారని తెలిపారు. 

‘హీరోయిన్లు గ్లామర్ డాల్స్ గా ఉండే రోజులు పోయాయి. నాయికలంటే పొట్టి దుస్తులు వేసుకునే వారే కాదు. హీరోల పక్కన రొమాంటిక్ లీడ్ గా హీరోయిన్లు కనిపించడం తగ్గింది. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ల పాత్రల్ని మెరుగ్గా తీర్చిదిద్దుతున్నారు. నటనకు ఆస్కారం ఉండేలా, కథను నడిపించేలా వారి పాత్రల్ని రాస్తున్నారు. కొన్ని మూవీల్లో హీరోల పాత్రలతో సమానంగా హీరోయిన్ల క్యారెక్టర్లు ఉండేలా చూపిస్తున్నారు’ అని ప్రియమణి పేర్కొంది. పుష్పలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ పై ప్రియమణి ప్రశంసల వర్షం కురిపించింది. ఈ పాటలో ఆమె చాలా హాట్ గా కనిపించిందన్నారు. ఈ సాంగ్ లో కొరియోగ్రఫీ అదిరిపోయిందని.. సమంత లుక్స్, స్టెప్పుల వల్ల పాట నంబర్ వన్ హిట్ గా మారిందన్నారు.