మీ కుల గజ్జిని అమెరికాపై రుద్దొద్దు : గుజరాత్ పటేల్ కు గడ్డిపెట్టిన బ్రాండెన్ గిల్

మీ కుల గజ్జిని అమెరికాపై రుద్దొద్దు : గుజరాత్ పటేల్ కు గడ్డిపెట్టిన బ్రాండెన్ గిల్

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా మీ భూభారతిని అన్నారు కానీ.. నీ కులాన్ని పొగుడు.. నీ కుల గజ్జిని ఆ దేశంపై రుద్దు అనలేదు.. ఇప్పుడు ఎందుకు ఈ సందర్భం అంటారా.. అమెరికా వెళ్లి అక్కడ వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న గుజరాతీల చేసిన వ్యవహారం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. వాళ్లు చేసిన అత్యుత్సాహం.. ఇప్పుడు అమెరికాలోని గుజరాతీలకే కాదు ఇండియన్స్ కు ముప్పుగా వాటిల్లింది. ఇంతకీ గుజరాతీలు అమెరికాలో ఏం చేశారు.. దానికి అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ఇచ్చిన సమాధానం ఏంటో చూద్దాం..

డిలాన్ పటేల్ అనే గుజరాతీ వ్యక్తి చేసిన కామెంట్ చూస్తే.. నా కులం (లేవా పాటిదార్ సమాజ్) వాలీబాల్ టోర్నమెంట్ అమెరికాలోని డల్లాస్ లో జరుగుతుంది. అమెరికాలో 40 వేల మంది మా లేవా పాటిదార్ సమాజ్ (గుజరాత్) కులపోళ్లు ఉంటే.. 8 వేల మంది ఈ వాలీబాల్ టోర్నమెంట్ కు వచ్చారు. వీళ్లందరూ గుజరాత్ నుంచి అమెరికా వచ్చారు. వీళ్లందరికీ అమెరికా దేశ వ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు డిలాన్ పటేల్. 

దీనిపై అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత బ్రాండెన్ గిల్ ఘాటుగా స్పందించారు. అమెరికా అనేది అవకాశాల గడ్డ.. అమెరికా అవకాశాల భూమి.. కుల వ్యవస్థ లేదు కాబట్టే అమెరికా ఇలా ఉంది. విదేశీయుల విశ్వాసాలు, నమ్మకాలు, కుల వ్యవస్థను దిగుమతి చేసుకోవటం.. అమెరికా శ్రేయస్సు, స్వేచ్ఛను నిలబెట్టుకోలేం. సరైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు పాటించనట్లయితే అమెరికా ఆత్మగౌరవం, సంస్కృతికి ఆత్మహత్య అవుతుంది అంటూ రిప్లయ్ ఇచ్చారు బ్రాండెన్ గిల్. 

అమెరికా ఇమ్మిగ్రేషన్ ను హెచ్చరిస్తూ.. ట్రంప్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ నేత  బ్రాండెన్ గిల్ చేసిన ఎక్స్ కామెంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. 
అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న ఇండియన్స్ ను వెనక్కి పంపిస్తు్న్న సమయంలో.. అందులోనూ అమెరికాలో ఇల్లీగల్ గా ఉంటూ పట్టుబడుతున్న వాళ్లలో గుజరాతీలు కూడా ఉండటంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశం అయ్యింది. గుజరాతీ పటేల్ కుల ప్రస్తావన అనేది అమెరికాకు సైతం ఆగ్రహం తెప్పించింది.
గుజరాతీల కుల భావన ఇప్పుడు మిగతా ఇండియన్స్ కు కూడా ముప్పు తెచ్చేలా ఉంది. 

Also Read : చైనాకు వచ్చే అమెరికా సరుకు ఇదే.. వీటిపైనా 15 శాతం పన్ను

అమెరికాలోని ఓ గుజరాతీ పటేల్ పెట్టిన పోస్టుకు.. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితుల్లో.. ఈ చర్చ తీవ్రంగా జరుగుతుంది. గుజరాతీ పటేల్ కు.. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండెడ్ గిల్ గట్టిగానే గడ్డి పెట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.