
ముంబై: మొత్తం రూ. 2000 నోట్లలో 97.82 శాతం తిరిగి బ్యాంకులకు వచ్చాయని, కేవలం రూ. 7,755 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని ఆర్‌బీఐ సోమవారం తెలిపింది. ఆర్‌బీఐ గత మే 19న రూ. 2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆనాడు వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్లుగా ఉన్న చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ, మే 31, 2024న వ్యాపారం ముగిసే సమయానికి రూ.7,755 కోట్లకు తగ్గింది. ఇప్పటికీ ప్రజలు రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుంచి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్‌బీఐ ఆఫీసులకు పంపవచ్చు.