
- ఎమ్మెల్యే రోహిత్‌రావు
- బీటీ రోడ్ల పునరుద్ధరణకు 15 కోట్లు విడుదల
మెదక్‌టౌన్, వెలుగు: మెదక్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను రోడ్లను బాగు చేస్తామని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. బీటీ రోడ్ల పునరుద్ధరణకు పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.15.10 కోట్ల నిధులు విడుదలైనట్లు సోమవారం తెలిపారు. ఈ నిధులతో నియోజక వర్గంలో దాదాపు 30.72 కిలోమీటర్ల రోడ్లకు మోక్షం లభిస్తుందని చెప్పారు.
ఇందులో భాగంగా మెదక్ మండలంలోని నవాపేట నుంచి మగ్దుంపూర్ బీటీ రోడ్డు పనులకు రూ.172 లక్షలు, పాపన్నపేట మండలంలోని నాగ్సాన్ పల్లి నుంచి కొడపాక వరకు రూ.196 లక్షలు, రామాయంపేట మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఆరేపల్లి మీదుగా లక్ష్మాపూర్, కాట్రియాల్, దంతేపల్లి బీటీ రోడ్డు పనులకు రూ.424 లక్షలు, చిన్నశంకరంపేట మండలంలోని జడ్పీ రోడ్డు నుంచి మీర్జాపల్లి తండా బీటీ రోడ్డు పనులకు రూ. 50 లక్షలు, హవేలీ ఘనపురం మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు పొల్కంపేట మీదుగా బూర్గుపల్లి వరకు రూ.508 లక్షలు, చిన్నశంకరంపేట మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు చందంపేట నుంచి డి. రుద్రారం వరకు రూ.80 లక్షలు, నిజాంపేట మండలం నుంచి చల్మెడ వరకు రూ.80 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.