- రూ.2,750 కోట్ల ఉపాధి హమీ నిధులతో వర్క్స్
హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాలన ప్రజా విజయోత్సవాలను అన్ని గ్రామపంచాయతీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా రూ.2,750 కోట్ల నిధులతో పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా (పశువుల పాకలు, కాంపోస్ట్ గుంతలు, కోళ్ల ఫారాలు), పొలం బాటలు (వ్యవసాయ పొలాలకు బాటలు), నర్సరీలు, జలనిధి (చెక్ డ్యామ్లు, కుంటలు), గ్రామీణ మౌలిక వసతులు (సీసీ రోడ్లు) తదితర పనులను ఉపాధి పథకం కింద ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.