వరంగల్ బల్దియా బడ్జెట్ ​రూ.612 కోట్లు

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కు సంబంధించిన 2023–24 సంవత్సరానికి గాను ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఇవాళ పాలకవర్గం ఆమోదించింది. రూ .612 కోట్ల 29 లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో రూ.213 కోట్ల 63 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.394 కోట్ల 16 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా​చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జీడబ్లుఎంసీ కమిషనర్ ప్రావీణ్య, డిప్యుటీ మేయర్ రిజ్వాన శమిమ్ మసూద్ పాల్గొన్నారు.