లాలాగూడలో ఓ రౌడీ షీటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దారి దోపిడీలకు పాల్పడటమే కాకుండా హత్యాయత్నా లకు పాల్పడుతున్న ఆసిఫ్ రెహమాన్ అనే రౌడి షీటర్ ను మే 27వ తేదీ సోమవారం లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డిసిపి గిరిధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
మే 26వ తేదీ ఆదివారం రాత్రి నార్త్ లాలాగూడలో రౌడీషీటర్ రెహమాన్.. కృష్ణయ్య అనే వ్యక్తిని కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారైన రెహ్మాన్.. మార్గమధ్యన మెట్టుగూడలో ఒక వ్యక్తిని కొట్టి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు. బాధితుడు కృష్ణయ్య ఫిర్యాదుతో లాలాగూడా పోలీసులు రెహ్మాన్ అతని స్నేహితుడు మహమ్మద్ మెహబూబ్ ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోకేసులో మొబైల్స్ దొంగలించి జల్సాలకు పాల్పడుతున్న డిగ్రీ విద్యార్థులు మహమ్మద్ సోయల్, మహమ్మద్ మహబూబ్ కూడా అరెస్ట్ చేశారు. మొబైల్ దొంగలించి జగదీష్ మార్కెట్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో షాపు యజమాని మహమ్మద్ షకిల్ ఖాన్ కూడా అరెస్టు చేశారు. ముఠాలో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఈ రెండు కేసుల్లో నిందితులను కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నామని డీసీపీ చెప్పారు.