కరీంనగర్ లో ఏం జరుగుతుంది : 12 రోజుల్లో.. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ మృతి

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న మరో  హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. 12 రోజుల్లో.. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ చనిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ రావడంతో హైదరాబాద్ కు చెందిన యుగంధర్ 2023 మే 22నుంచి  కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. 

Also Read:రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలు.. భారీ బహిరంగ సభలకు ప్లాన్

2023 జూన్ 06 మంగళవారం రోజున టిఫిన్ చేయడానికి వెళ్లిన సమయంలో యుగంధర్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పి్ంచారు. అక్కడ చికిత్స పొందుతూ యుగంధర్ చనిపోయాడు,  అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన తర్వాతే యుగంధర్ చనిపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. యుగంధర్ మృతి పట్ల కుటుంబ సభ్యులు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

2023 మే 25న కూడా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో హైదరాబాద్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రానాసింగ్ అనే వ్యక్తి  శిక్షణ తీసుకుంటూ మృతిచెందాడు. ఇది జరిగిన 12 రోజుల తరువాత మరొక హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడంతో ట్రైనింగ్ సెంటర్ లో అసలేం జరుగుతుందో తెలియక కోచింగ్ తీసుకుంటున్న  అభ్యర్థులు భయాందోళనలకు గురవుతున్నారు.