ఆర్మూర్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ వినోద్ కుమార్
ఆర్మూర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఒతిళ్లకు తలొగ్గొద్దని ఆర్మూర్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, ఆర్డీవో వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఎలక్షన్ ఆఫీసర్లకు మాడల్ కోడ్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారుల సహకారం తప్పనిసరి అన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు సైతం మాడల్కోడ్ విధివిధానాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తమకు కేటాయించిన డ్యూటీలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు పాల్గొన్నారు.
ALS0 READ: రాజగోపాల్ రెడ్డి రాజీనామా అందరూ ఊహించిందే : బూర నర్సయ్య గౌడ్