- 6 అసెంబ్లీ సీట్లు కేటాయించాలె: బైరి వెంకటేశం
హైదరాబాద్, వెలుగు: తమ సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్‌లో లక్ష మందితో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని ‘ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి’ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించే ఈ సభలో అన్ని జిల్లాల నుంచి దళిత ఉపకులాల ప్రజలు పాల్గొంటారని తెలిపారు. ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘దళిత ఉపకులాలు సామాజిక -రాజకీయ చైతన్యం’ అనే అంశంపై సెమినార్ జరిగింది.
ALSO READ :ఢిల్లీ వాసులకు కాస్త ఊరట.. ట్రాఫిక్ కోసం తెరచిన రోడ్లు
వెంకటేశం మాట్లాడుతూ దళితులలో మాల, మాదిగ కులాలు కాకుండా మిగిలిన అత్యంత వెనుకబడిన 57 ఉపకులాలు అభివృద్ధికి దూరమయ్యాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీలన్నీ తమ సామాజిక వర్గాలకు 6 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ చూపిన దారిలో పోరాటం చేయవలసిన అవసరం ఉందని దళిత ఉద్యమ నేత జేబీ రాజు సూచించారు.