Cricket World Cup 2023: ఓ వైపు లోపాలు.. మరోవైపు తప్పులు: బీసీసీఐపై క్రికెట్ అభిమానులు గరం గరం

Cricket World Cup 2023: ఓ వైపు లోపాలు.. మరోవైపు తప్పులు: బీసీసీఐపై క్రికెట్ అభిమానులు గరం గరం

భారత్ లో తొలిసారి పూర్తి స్థాయిలో వరల్డ్ కప్ ని నిర్వహించడంతో దేశంలో పండగ వాతావరణం నెలకొంది. స్వదేశంలో వరల్డ్ కప్ కావడంతో బీసీసీఐ మ్యాచుల విషయంలో ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయడంతో ఈ వరల్డ్ కప్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ అనుకున్నారు. కానీ తొలి వారం ముగిసేసరికి సీన్ అంతా మారిపోయింది. ఆటగాళ్లు అదరగొడుతున్నా.. బీసీసీఐ తీరుపట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాటిలో కొని ఇప్పుడు చూద్దాం.       


1) మోడీ స్టేడియంలో ఖాళీ స్టాండ్‌లు

టోర్నమెంట్ ప్రారంభ మ్యాచులో ఇంగ్లండ్ మరియు న్యూజిలాండ్ ఆటగాళ్లు మోడీ స్టేడియం వద్ద ఖాళీ స్టాండ్‌లతో స్వాగతం పలకడం ఆశ్చర్యానికి గురి చేసింది. అధికారిక బుకింగ్ యాప్ ఇంకా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని సూచిస్తున్నప్పటికీ జనం ఎవ్వరు కూడా ఈ మ్యాచ్ పై ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ మ్యాచ్ వార్మప్ లా గేమ్ లా అనిపించింది. లక్ష 32 వేల కెపాసిటీ ఉన్న స్టేడియంలో కేవలం 4000 మంది మాత్రమే ఈ మ్యాచ్ చూడడానికి వచ్చారు. 

2) ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో పవర్ కట్

న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ నెదర్లాండ్స్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో ఊహించని పరిస్థితి నెలకొంది. ఈ ఇంటర్వ్యూ సమయంలో  పవర్ కట్ కావడంతో అంతా చీకటిమయమైంది. దీంతో కివీ క్రికెటర్ మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్ సహాయంతో తన ఇంటర్వ్యూని కొనసాగించాడు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఇలా జరగడం బీసీసీఐ లోపాలను ఎత్తి చూపుతుంది.    

ALSO READ: Cricket World Cup 2023: పాలస్తీనాకు మద్దతు తెలిపిన పాక్ క్రికెటర్.. భారత్‌లో ఉన్నన్నాళ్ళు జాగ్రత్త!

3) ధర్మశాల అవుట్‌ఫీల్డ్ సమస్యలు

ధర్మశాలలోని అవుట్‌ఫీల్డ్ పరిస్థితి బిసిసిఐని ఎప్పటినుంచో వేధిస్తుంది. ఇక్కడి అవుట్‌ఫీల్డ్ ఫీల్డింగ్ కు చాలా ప్రమాదకరంగా ఉంటుంది.    ఇటీవల బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా మంది ఆటగాళ్లు డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు జారి కింద పడ్డారు. ఈ సమస్య. చాలా మంది ప్లేయర్లు అవుట్ ఫీల్డ్ పై తమ అసంతృప్తిని తెలియజేసారు.    

4) ప్రారంభ వేడుకలు లేకపోవడం

ICC ప్రపంచ కప్ 2023కి అధికారిక ప్రారంభ వేడుకలు లేకపోవడం క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే మరో అంశం. ఈ మినహాయింపుకు బీసీసీఐ అనేక కారణాలు చెప్పుకొచ్చింది. టోర్నీ మధ్యలో కానీ చివర్లో కానీ ఈ వేడుకలు ఉంటాయని చెప్పడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఐపీఎల్ లాంటి వేడుకలను ఎంతో అట్టహాసంగా చేసే బీసీసీఐ ఇలా ప్రారంభ వేడుకలు చేయకపోవడంతో తీవ్ర విమర్శలకు దారి తీసింది.