జూన్ 10వ తేదీలోగా వనమహోత్సవం టార్గెట్ రీచ్ కావాలి : కుమార్ దీపక్

జూన్ 10వ తేదీలోగా వనమహోత్సవం టార్గెట్ రీచ్ కావాలి : కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటేందుకు నిర్ధేశించిన లక్ష్యాలను ఈ నెల 10లోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మండలాల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై గురువారం కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావుతో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ALSO Read : ఉత్తమ సేవలతోనే గుర్తింపు దక్కుతుంది

కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన వనమహోత్సవం లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామపంచాయతీల పరిధిలో వ్వక్తిగత, సామాజిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. బహిరంగ మాల, మూత్ర విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. విద్యుత్ పొదుపులో భాగంగా గ్రామపంచాయతీల పరిధిలో సోలార్ వీధిదీపాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పలు అంశాలపై చర్చించారు. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.