హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ సీరియస్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాలకు పర్మిషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కారు.. తమ పార్టీకి మాత్రం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ‘ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ లో 120 మందితో కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ క్యాంపు నిర్వహణకు పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. కానీ వారు అనుమతి నిరాకరించారు. అయితే 300 మందితో సంఘ్ నిర్వహించిన సంఘ్ శిక్షణకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. ఎందుకీ ద్వంద్వ నీతి?’ అని ఠాగూర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఢిల్లీలోనే కాదు.. గల్లీలోనూ దోస్తీ నడుస్తోందని ట్వీట్ చేశారు.
When @INCTelangana ask permission for Training camp in Hyderabad from 9 to11 January with 120 people TRS government denies permission..but for 300+ Sanghi’s it give protection& permission. Why this double standard?
— Manickam Tagore .B??✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) January 7, 2022
Deli mey Dosti now Gali mey be Dosti ?https://t.co/ekU8pDc6gQ
మరిన్ని వార్తల కోసం: