- రూ.లక్ష రుణమాఫీ చేయాల్సిందే
- మునుగోడు మండలం కొంపెల్లిలో రైతులు ఆందోళన
మునుగోడు(చండూరు), వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయల రుణ మాఫీ చేయాలని రైతులు డిమాండ్చేశారు. సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి కెనరా బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2018 నుంచి తీసుకున్న అప్పుకు వడ్డీలు కట్టి రెన్యువల్ చేసుకొంటూ వస్తున్నామని తెలిపారు. అన్ని బ్యాంకుల్లోని రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం ఇక్కడి బ్యాంకులో ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు.
ALSO READ:ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైలెన్స్ .. కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు
బ్యాంకర్ల తీరును సహించబోమని, సంబంధిత అధికారులు స్పందించి వెంటనే న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రూ.లక్ష రుణమాఫీ అయ్యేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వాగ్వాదానికి దిగారు. అధికారులతో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.