ఇల్లు అలకగానే పండగ కాదు.. ఎన్నికలకు ఇంకా 3 నెలలు ఉంది

రాబోయే రోజుల్లో అనేక మార్పులు చేర్పులుంటాయన్నారు స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య.  లింగాలగణపురం మండలంలో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో స్థానిక ప్రజా ప్రతినిధుల గైర్హాజరయ్యారు.  ఈసందర్భంగా మాట్లాడిన ఆయన..చెక్కుల పంపిణీకి హాజరుకాని  ప్రజాప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు.  సంవత్సరాలుగా ప్రజా జీవితంలో అందరం కలిసి పని చేశామని..ఇల్లు అలకగానే పండగకాదని.. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉందన్నారు.  ఏదో జరగబోయేది ఊహించుకోవద్దని.. రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులుంటాయని చెప్పారు. అందరూ ప్రజాక్షేత్రంలో ఉండాలని.. తన వెంట ఉన్న  కార్యకర్తలందరినీ తాను కాపాడుకుంటానని తెలిపారు. తానే ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పారు. 

ALSO READ :తిరుమలలో ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు

వచ్చే ఎన్నికల్లో   స్టేషన్ ఘన్ పూర్ టికెట్  ను కేసీఆర్ కడియం శ్రీహరికి కేటాయించారు. దీంతో రాజయ్య అసంతృప్తిగా ఉన్నారు. అధిష్టానం పునరాలోచిస్తుందని.. తనకే టికెట్ కేటాయిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజయ్య.