ఒక సాధారణంగా రైతు బిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లోకి అడుగువైపెట్టాడు పల్లవి ప్రశాంత్(Pallavi prashanth). ముందు మనోడిని అందరు తక్కువ అంచనా వేశారు కానీ.. ఊహించని విధంగా టాస్కులు ఆది బిగ్ బాస్ సీజన్ 7కు మొదటి కెప్టెన్ గా నిలిచాడు. దీంతో హౌస్ మేట్స్ అందరు ఒక్కసారిగా షాకయ్యారు. దాంతో పల్లవి ప్రశాంత్ తో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం అర్థమైంది.
అయితే కెప్టెన్ గా గెలిచాడు కానీ.. తర్వాతే సైలెంట్ అయిపోయాడు. బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ గా చేయడం అంటే అంత ఈజీ కాదు. అందరిని తన మాట వినేలా చేయాలి, ఎవరి పనులు వాళ్లకి అప్పజెప్పడమో, ఇలా చాలా బాధ్యతలే ఉంటాయి. కానీ ప్రశాంత్ అవేమి చేయకుండా చాలా సైలెంట్ గా ఉంటున్నాడు.
Also Read :- రెండు నెలల గ్యాప్లో వ్యూహం, శపధం సినిమాలు
ఇదంతా గమనించిన బిగ్‌బాస్.. అతనిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ పై ఇంటి సభ్యుల అభిప్రాయాన్ని తీసుకున్నాడు. కెప్టెన్సీ అర్థమేంటో చెప్పాలని ప్రశ్నిచాడు. అనంతరం పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్ అని ఎంతమంది అనుకుంటున్నారు చేతులెత్తమన్నాడు. దానికి హౌస్‌లో ఉన్న దాదాపు అందరూ చేతులెత్తారు. దీంతో ప్రశాంత్ కెప్టెన్సీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. అది తట్టుకోలేని ప్రశాంత్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత ఎం జరిగింది అనేది ఇవాళ్టి ఎపిసోడ్ లో తెలియనుంది.