కరోనా కట్టడిపై ప్రధాని మోడీ సమీక్ష

ఢిల్లీ : దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్  కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే 230 దాటింది. ఈ క్రమంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30గం.లకు జరగనున్న ఈ భేటీలో వైరస్ కట్టడి, నియంత్రణ మార్గాలపై చర్చించనున్నారు. పండగల సీజన్ కావడంతో కరోనా మరింత విజృంభించే అవకాశముంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించే అవకాశముంది. దీంతో పాటు బూస్టర్ డోస్ కు అనుమతించే అంశంపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని సూచించింది.

మరిన్ని వార్తల కోసం..

ఇమ్యూనిటీని సహజంగా పెంచుకుంటున్న భారతీయులు

236కు చేరిన ఒమిక్రాన్ కేసులు